యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈసినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలై ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా అవార్డులను సొంతం చేసుకుంటూనే ఉంది. ముఖ్యంగా ఈసినమాకు పలు అంతర్జాతీయ అవార్డులు దక్కడం విశేషం
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈపాటకు నిజంగా చిత్రయూనిట్ ఎంత కష్టపడిందో, రాజమౌళి ఎన్నిసార్లు తీశాడో ఈసినిమా రిలీజ్ సమయంలో పలు ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఒక్క పాట కోసం దాదాపు 18 టేక్స్ తీసుకున్నారు. అంతేకాదు ఈ పాటలో వచ్చే స్టెప్స్ దగ్గర నుండి స్టెప్స్ వేస్తున్నప్పుడు వచ్చే దుమ్ము కూడా సింక్ లో ఉండాలని రాజమౌళి నరకం చూపించారని ఎన్టీఆర్, చరణ్ చమత్కరించారు అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దక్కింది. అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కీరవాణి సొంతం చేసుకున్నారు. ఇక పాటను చంద్రబోస్ రాయగా..రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
ఇక ఆర్ఆర్ఆర్ ఈ అవార్డును సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈసందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. ఇండియన్ సినిమా కల నిజమయింది.. కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇంకా చిత్రయూనిట్ అందరికీ అభినందనలు.. ఇంకా ఎన్నో సాధించాలి అంటూ ట్వీట్ చేశారు.
Watching the world cheer for an Indian film is a dream come true!! This year couldn’t have started on a better note! Congratulations @mmkeeravaani garu, @ssrajamouli sir, @tarak9999, @AlwaysRamCharan & the entire team of #RRR… Many more to come!! 🤗🤗🤗 https://t.co/a2a17lnJdN
— Mahesh Babu (@urstrulyMahesh) January 11, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: