దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఈసినిమా గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈసినిమా కోట్లు రాబట్టుకుంది. ఇక్కడ మాత్రమే కాదు రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆతరువాత సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. రీసెంట్ గా రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించింది. ఇక ఇప్పుడు మరో అవార్డును సొంతం చేసుకుంది.ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కంగ్రాట్యూలేషన్స్ ఆర్ఆర్ఆర్ టీమ్.. ఈ విజయానికి అభినందనలు.. మీరు భారతదేశం గర్వపడేలా చేసారు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
T 4524 – Congratulations RRR, for winning the Golden Globe Award .. a most well deserving achievement !!
ఈ విజయానికి అభినందనలు
RRR, మీరు భారతదేశం గర్వపడేలా చేసారు
Ī vijayāniki abhinandanalu RRR, mīru bhāratadēśaṁ garvapaḍēlā cēsāru
👏👏👏👏👏👏👏#RRR #GoldenGlobes pic.twitter.com/sB0Kc9zuqt— Amitabh Bachchan (@SrBachchan) January 11, 2023
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: