హిట్ 2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుండే ఈసినిమా సీక్వెల్ ఉంటుందని చెబుతూనే ఉన్నాడు అడివి శేష్. ఇక ఈ మధ్యలో ఎవరు, మేజర్, హిట్ 2 లాంటి సినిమాలు చేశాడు. ఇక ఈసినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది గూఢచారి సీక్వెల్ ను లైన్ లో పెట్టాడు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించాడు అడివి శేష్. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రీ విజన్ వీడియో పేరుతో చిన్న గ్లింప్స్ ను నిన్న ముంబైలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక నేడు హైద్రాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సందర్బంగా అడివి శేష్ మాట్లాడుతూ.. గూఢచారి2 ని ఒక ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే తపన వుంది. కొత్త దర్శకుడు వినయ్ కి చాలా గ్రేట్ విజన్ వుంది. తనకి గూఢచారి వరల్డ్ పై చాలా మంచి పట్టువుంది. మా నిర్మాతలు విశ్వప్రసాద్, అనిల్, అభిషేక్ గారికి కృతజ్ఞతలు. నేను ఏదడిగినా సమకూరుస్తారు. గూఢచారి సౌత్ ఇండియా స్పై సినిమాల ట్రెండ్ మళ్ళీ తీసుకొచ్చింది. గూఢచారి2 తో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా మారబోతుంది. గూఢచారి2 నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. సిక్స్ ప్యాక్ చేసి షూటింగ్ మొదలుపెడతాం.. గూఢచారి2 కి శ్రీచరణ్ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్నాం. గూఢచారి 2 ఏ స్థాయిలో వుంటుందో ప్రేక్షకులకు చిన్న రుచి చూపించడానికి ప్రీవిజన్ ని లాంచ్ చేశాం. 2024లో జి2 రాక్ ది బాక్స్ ఆఫీస్’’ అన్నారు.
కాగా మేజర్ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: