బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నుండి సినిమా వచ్చి చాలా ఏళ్లు అయిపోయింది. ఇక ఫైనల్ గా ఈ ఏడాది పఠాన్ సినిమాతో వచ్చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇంకా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగులోనూ లో ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ట్రైలర్ ను మెగాస్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. పఠాన్ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ అందించారు చరణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ ట్వీట్ కు షారుక్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. థాంక్యూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎప్పుడైతే మీ ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్‌ను తీసుకొస్తుందో.. ఒకసారి దాన్ని టచ్ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు..ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు ఒకసారి నన్ను దాన్ని టచ్ చేయనివ్వండి అని ట్వీట్ చేశాడు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ హాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ మూవీని లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీన్ చేస్తున్నారు.
Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!!
(Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! )
Love you.— Shah Rukh Khan (@iamsrk) January 10, 2023
కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. జాన్ అబ్రహం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా.. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: