దసరా-నాని ఫ్యాన్స్ కు టీమ్ రిక్వెస్ట్

Nani Dasara Team Reaction On Leaked Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasara Movie Update,Dasara Movie Latest Updates,Dasara Movie Latest Update,Dasara Latest Update,Dasara Latest Updates,Dasara Telugu Movie Latest Updates,Dasara Movie News,Dasara Telugu Movie Latest News,Dasara Movie Latest News,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani New Movie Updates,Nani Latest Movie Updates,Nani Movie Updates,Nani Movie News,Nani New Projects,Nani Latest Projects,Nani Upcoming Projects,Nani Next Projects,Nani Latest News,Nani Movie Updates,Nani Dasara,Nani Dasara Movie,Nani Dasara Movie Team Reaction On Leaked Video,Dasara Leaked Video,Dasara Movie Leaked Video,Dasara Movie Latest Video,Dasara Movie New Video

పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకూ ఇప్పుడు లీక్స్ కామన్ అయిపోయాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో ఒక రకంగా ఏదో ఒక లీక్ అనేది వస్తునే ఉంటుంది. తాజాగా నాని దసరా సినిమా కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నా కూడా ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. అప్పుడప్పుడు ఒక పోస్టర్.. దసరా కు ఒక పాటను రిలీజ్ చేశారు తప్పా అంతకుమించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరోవైపు నాని ఫ్యాన్స్ ఈసినిమా నుండి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాా ఈసినిమా షూటింగ్‌ సెట్స్ నుంచి లీకైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై స్పందించిన మేకర్స్.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లీక్డ్ వీడియోను షేర్ చేయొద్దని ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు మరి కొద్దిరోజుల్లో సాలిడ్ అప్‌డేట్‌తో ముందుకొస్తామని.. అప్పటి వరకు ఓపిక పట్టాలని చిత్ర బృందం అభిమానులను అభ్యర్థించింది.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. 30 మార్చి2023న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − four =