నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. రాయలసీమలో వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నాడు గోపీచంద్. ఇక ఈసినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పాటలు, పోస్టర్లతోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. దాంతో ఈసినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ వెయిట్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫైనల్ గా నిన్న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ కు ఎంత రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. ఫ్యాన్స్ ను మాస్ ఫీస్ట్ ను అందించారు వీరసింహారెడ్డి టీమ్. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ ముందే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్రైలర్ రిలీజ్ అయితే యూట్యూబ్ రచ్చ రచ్చే అని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక థమన్ చెప్పినట్టే ప్రస్తుతం ఈ ట్రైలర్ మాత్రం యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో టాప్ 1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను .. 300K లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.
The GOD OF MASSES ruling YouTube 💥#VeeraSimhaReddyTrailer Trending #1 with 5M+ views & 300K+ likes 🔥
– https://t.co/1uH3QxI35G#VeeraSimhaReddy
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/IX6KddwNpo— Mythri Movie Makers (@MythriOfficial) January 7, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: