నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా కూడా సంక్రాంతికి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక మేకర్స్ మాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. రోజుకో అప్ డేట్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ పాటలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో సర్ ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Roar of #VeeraSimhaReddy 🔥
Here’s the Massive Making Video 💥Mass Jaathara in theatres from Jan 12th 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/lnZhPHJzEF
— Mythri Movie Makers (@MythriOfficial) December 31, 2022
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: