నాని సరసన లేటెస్ట్ హిట్ బ్యూటీ?

Mrunal Thakur To Play Female Lead in Nani 30th Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Mrunal Thakur,Mrunal Thakur Latest News,Mrunal Thakur Upcoming Movie News,Mrunal Thakur Latest Film Details,Actress Mrunal Thakur,Heroine Mrunal Thakur,Nani,Nani 30th Movie Latest News

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ సిద్దం చేస్తున్నాడు. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా నాని తన కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను నిన్న ఇచ్చిన సంగతి తెలిసిందే. నాని 30వ సినిమా అది. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.
ఇక ఈసినిమా గురించి రేపు ఫుల్ డిటైల్స్ తెలుపనున్నారు చిత్రయూనిట్. అయితే ఈ గ్యాప్ లోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈసినిమాలో నటించే హీరోయిన్ గురించి. ఈసినిమాలో హీరోయిన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నచించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =