మాస్ మహారాజాకు మరోసారి సరైన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ధమాకా సినిమాతో నిరూపించాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. కామెడీకి కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్, సంగీతం అన్నీ ఈసినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అందుకే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే ఈసినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలోని పాటలకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాపై ఒకరకంగా మంచి బజ్ ఏర్పడటానికి కూడా ఈ పాటలు దోహదపడ్డాయి. అందుకే రవితేజ కూడా ఈసినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ సంగీత దర్శకుడు బీమ్స్ కే చెందాలి అంటున్నాడు. తాజాగా ఈసినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ‘మాస్ మీట్’ పేరుతో నిర్వహించిన ఈసక్సెస్ మీట్ కు రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించి ముందుగా నా టెక్నీషియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ వలన ఈ సినిమా తెరపై ఇంత కలర్ఫుల్ గా కనిపించింది. మేము కూడా చాలా అందంగా కనిపించాము అని తెలిపారు. ముఖ్యంగా ఈసినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ బీమ్స్ కు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: