18 పేజెస్ మూవీ రివ్యూ- క్రేజీ లవ్ స్టోరీ

18 Pages, 18 Pages (2022 film), 18 Pages (2022) – Movie, 18 Pages (Telugu) (2022) – Movie, 18 Pages 2022, 18 Pages Critics Review, 18 Pages Film, 18 Pages First Review, 18 Pages Movie, 18 Pages Movie – Telugu, 18 Pages Movie (2022), 18 Pages Movie Highlights, 18 Pages Movie Plus Points, 18 Pages Movie Public Response, 18 Pages Movie Public Talk, 18 Pages Movie Review, 18 Pages Movie Review And Rating, 18 Pages Movie Updates, 18 Pages Review, 18 Pages Review – Telugu, 18 Pages Story review, 18 Pages Telugu Movie, 18 Pages Telugu Movie Latest News, 18 Pages Telugu Movie Live Updates, 18 Pages Telugu Movie Review, 18 Pages Telugu Review, 2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, Anupama Parameswaran, Bunny Vas, GA2 Pictures, Gopi Sundar, Latest 2022 Telugu Movie, latest movie review, Latest telugu movie reviews, Latest Telugu Movie Reviews 2022, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, latest tollywood updates, New Movie Reviews, New Telugu Movie Reviews 2022, New Telugu Movies 2022, Nikhil Siddhartha, Palnati Surya Pratap, sukumar, Sukumar Writings, Telugu cinema reviews, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Movie Ratings, telugu movie reviews, Telugu Movie Reviews 2022, Telugu Movies 2022, Telugu Reviews, Telugu Reviews 2022, Tollywood Movie Updates, Tollywood Reviews

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా 18 పేజెస్. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ ఈసినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, దినిష్ తేజ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, అజయ్ గోపరాజు, రమణ తదితరులు
దర్శకత్వం.. పల్నాటి సూర్య ప్రతాప్
బ్యానర్స్.. సుకుమార్‌ రైటింగ్స్, జీఏ2 ఫిల్స్
నిర్మాత..బన్నీ వాసు
సంగీతం.. గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రఫి.. వసంత్

కథ..

సిద్ధూ(నిఖిల్‌) హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. లవ్‌ ఫెయిల్యూర్‌ అయి ఆ బాధలో ఉంటాడు. అలాంటి సిద్దూకు ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ నందిని(అనుపమా పరమేశ్వరన్‌) అనే అమ్మాయిది. నందిని మాత్రం ఈజనరేషన్ కి తగ్గట్టుగా కాకుండా.. టెక్నాలజీకి దూరంగా ఉంటూ అలానే అనుబంధాలకు విలువిచ్చే అమ్మాయి. ఆ డైరీ చదువుతూ నచ్చిన సిద్దూ ఆమె లాగే జీవించాలని ప్రయత్నిస్తుంటాడు. ప్రక్రియలో అతను ఆమె జ్ఞాపకశక్తి కోల్పోయి అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలుసుకుంటాడు. ఆమె తన డైరీలోని 18వ పేజీలో ఉండగా ఆమె కిడ్నాప్ అవ్వడం మరియు జ్ఞాపక శక్తిని కోల్పోవడం కథలో ఒక మలుపు తిరుగుతుంది. అయితే చివరికి సిద్ధార్థ్, నందిని తన డైరీ ని ఉపయోగించి ఎలా కనిపెట్టాడు… నందిని నిజంగానే చనిపోయిందా? చంపేశారా? నందిని లైఫ్‌ ఏంటీ? ఆమె దుండగులు ఎందుకు చంపాలనుకుంటారు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ..

ఈఏడాది కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు నిఖిల్. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. నిజానికి ఈసినిమా కార్తికేయ 2 సినిమా కంటే ముందే రిలీజ్ అవ్వాల్సింది కానీ కార్తికేయ2 సినిమానే రిలీజ్ అయి మంచి బూస్ట్ ను ఇచ్చింది. ఇక ఇప్పుడు 18 పేజెస్ అనే లవ్ స్టోరీతో వచ్చేశాడు. 18 పేజెస్ సినిమా డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇలాంటి ప్రేమ కథలు చాలా అరుదు. హీరోయిన్‌ రాసుకున్న డైరీలోని పేజీలను చదువుతూ, ఆమె చేసే పనులను ఫీల్‌ అవుతూ ఆమె ప్రేమలో పడిపోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథనం మరియు ఆసక్తికరమైన పాత్రలు, ప్రేమకథతో నడపగా ఇంటెర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్ కిడ్నాప్ కు గురవడంతో థ్రిల్లర్ మోడ్ లోకి మారుతుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్.. ట్రైన్‌ సీన్‌ క్లాప్స్ కొట్టేలా ఉంటుంది.

నిజానికి లవ్ స్టోరీస్ అంటే మనకు గుర్తొచ్చేది హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, మాటలు, పాటలు ఇలానే ఊహించుకుంటాం.. కానీ ఈసినిమాలో అవి ఉండవు.. హీరో, హీరోయిన్లు చివరి సీన్ వరకు అస్సలు కలుసుకోరు. కలుసుకున్నా కూడా వారిద్దరి మధ్య మాటలు అసలే ఉండవు. అలాంటి సీన్ తీయడం, రాయడం, అసలు అలా ఊహించుకోవడం కూడా చాలా కష్టమే. కానీ కథను రాసింది సుకుమార్ కాబట్టి, తీసింది ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ కాబట్టి అది సాధమ్యైనట్టుగా కనిపిస్తుంది. అచ్చమైన, స్వచ్చమైన ప్రేమకు అర్థం చెప్పేలా 18 పేజెస్ సినిమా ఉన్నట్టుగా అనిపిస్తుంది.

హీరోగా చేసిన నిఖిల్ సిద్దూ పాత్రలోయాప్ట్ గా చేశాడు. ఆ పాత్రకి తనే పర్‌ఫెక్ట్ అనేలా కుదిరాడు. అంతే బాగా చేశాడు. ఇక టెక్నాలజీ పెరిగిపోయి, స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టలలో మునిగిపోతూ ఇంటర్నెట్‌ తో బతికేస్తున్న ఈ ప్రపంచంలో వాటి అన్నింటికి దూరంగా మనుషులంటే ఇష్టపడే అమ్మాయి గా నందిని పాత్రను ఆవిష్కరించిన తీరు బాగుంది. ఆ పాత్రకు అనుపమా కరెక్ట్ గా సరిపోయింది. నిఖిల్ ఫ్రెండ్ గా చేసిన సరయు ఉన్నంతలో కామెడీగా బాగా చేసింది. మిగిలిన పాత్రల్లో ఎవరికి వారు న్యాయం చేశారు.

టెక్నికల్ వాల్యూస్

ఈసినిమాకు మ్యూజిక్ కూడా ప్రధానం బలంగా నిలిచింది. గోపీసుందర్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజి, పాటలు బాగున్నాయి. లవ్ స్టోరీలోని ఫీల్‌ని మరింత పెంచాయి. `టైమ్‌ ఇవ్వు పిల్లా`, `నిదురన్నది లేదే ఓ పిల్లా` అనేతెలంగాణ యాసలో సాగే పాట, `నన్నయ్య రాసిన ` పాటలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే 18 పేజెస్ సినిమా ఓ విభిన్నమైన లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. భావోద్వేగ భరితంగా సాగే ఫీల్‌ గుడ్‌ డిఫరెంట్‌, క్రేజీ లవ్‌ స్టోరీగా నిలుస్తుంది 18 పేజెస్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fifteen =