క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు.
ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు కృష్ణవంశీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. నేనొక నటుడుని.. అంటూ సాగే షాయరీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు మెగాస్టార్. నేనొక నటుడ్ని, చప్పట్లను భోంచేస్తూ, ఈలలను శ్వాసిస్తూ, అనుక్షణం జీవించే అల్పసంతోషిని నేను, మీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్ని, సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని, రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను, పూటపూటకూ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను’ అంటూ సాగిన 4 నిమిషాలకు పైగా ఉన్న ఈ కవితకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
A Mega Thanks to everyone for the huge response ❤️#NenokaNatudni ft. Megastar Dr. @KChiruTweets 🌟 out now!
▶️ https://t.co/bWxmsQS2fP#Rangamarthanda @director_kv @PRAKASHRAAJ @MERAMYAKRISHNAN #BRAHMANANDAM @ilaiyaraaja @LakshmiBhupal @RajaShyamalaEnt @SillyMonksMusic pic.twitter.com/GcsOd9GUJP— Raja Shyamala Entertainments (@RajaShyamalaEnt) December 21, 2022
కాగా ఈసినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: