శశికాంత్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు డిసెంబర్ 30 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ చేస్తూ సినిమా అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. రేపు అంటే డిసెంబర్ 18 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: