సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. దానికితోడు అఖిల్ మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. అయితే ఈసినిమా నుండి చాలా కాలంగా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక ఇప్పుడు ఈసినిమా పెండింగ్ షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను మొదటి వారం నుండి మస్కట్ లో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఓభారీ యాక్షన్ షెడ్యూల్ ను అక్కడ ప్లాన్ చేశారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.
నిజానికి ముందు ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయలని ప్లాన్ చేశారు. కానీ ఈసినిమా షూటింగే ఇంతవరకూ పూర్తిచేసుకోలేదు. దీంతో సంక్రాంతి నుండి తప్పుకుంది ఈసినిమా. ఇక ఏప్రిల్ లో ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాల్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























