తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటి నుండీ కూడా విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందుంటాడు. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఈమధ్య కాలంలో అయితే సూర్య ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. నిజానికి ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు. మ్యాగ్జిమమ్ 2024 లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం. మరి దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
కాాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: