ఇండస్ట్రీలోకి డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తమిళ్, తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసి ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నాడు రాఘవ లారెన్స్. అలా డ్యాన్స్ మాస్టర్ స్థాయి నుండి పలు సినిమాల్లో కీలక పాత్రలను చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా డైరెక్టర్ గా ఇలా అన్నింటిలోనూ తన మార్క్ ను చూపించాడు. దీంతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా లారెన్స్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక ముని సినిమా తరువాత హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు లారెన్స్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రుద్రుడు సినిమా కూడా ఒకటి. కదిరేశన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా తమిళ్ లో రుద్రన్ టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో రుద్రుడు అనే టైటిల్ తో వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక నేడు లారెన్స్ పుట్టిన రోజు. ఈసందర్బంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక గ్లింప్స్ మాత్రం యాక్షన్ ప్యాక్డ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.
My birthday special for my fans! #RudhranGlimpsehttps://t.co/EqXCIIfU0Q pic.twitter.com/0GemCpzuBt
— Raghava Lawrence (@offl_Lawrence) October 29, 2022
కాగా ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ మూవీ లో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రుద్రన్ మూవీ ని తమిళ , తెలుగుతో పాటు మలయాళ , కన్నడ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: