ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ ఫుల్ పోలీస్ కదిరవన్ గా , వయసు మళ్లిన సర్దార్ గా రెండు పాత్రల్లోనూ కార్తీ ప్రేక్షకులను అలరించనున్న సర్దార్ మూవీ ట్రైలర్ శుక్రవారం అక్టోబరు 14వ తేదీన విడుదల అయ్యింది. భారీ స్థాయి గ్రాండియర్ విజువల్స్, యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్ , పలు సీన్స్ లో రకరకాల గెటప్స్ లో కార్తీ కనిపించడం, డైలాగ్స్, ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సర్దార్ ట్రైలర్ ఆడియన్స్ లో మూవీ పై మరింతగా ఆసక్తిని కలిగించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో సర్దార్ ట్రైలర్ కి మంచి వ్యూస్ లభిస్తున్నాయి.
#SARDAR will be a grounded Indian spy thriller. Our team feels proud to present the trailer to you all.
Tamil – https://t.co/usMwNSz5pC
Telugu – https://t.co/E6TJ1nSRgV #SardarDeepavali #SardarTrailer @Psmithran @lakku76 @gvprakash @Udhaystalin @iamnagarjuna
— Karthi (@Karthi_Offl) October 14, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: