కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో మొదలవ్వాలి. అయితే కరోనా వల్ల కొంత కాలం లేట్ అయితే ఆతర్వాత సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో మొత్తానికి బ్రేక్ పడింది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. అప్పట్లో షూటింగ్ టైమ్ లో తీసిన ఒక ఫొటోను పోస్ట్ చేశారు తప్పా అంతకుమించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఈసినిమా నుండి సాయిధరమ్ తేజ్ బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. దీనితో పాటు టైటిల్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని.. అలానే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
Celebrating our Supreme Hero @IamSaiDharamTej b’day with an Intriguing Poster from #SDT15 💥
Title reveal with Sneak peek video 🔜
Mystery Unveils, Summer 2023 ✅@karthikdandu86 @iamsamyuktha_ @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/JVLdsdyLkc
— SVCC (@SVCCofficial) October 15, 2022
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: