మొత్తానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా నుండి ఒక్క అప్ డేట్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఇంతవరకూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండానే డైరెక్టర్ ఓం రౌత్ చాలా సస్పెన్స్ మెంటైన్ చేశాడు. ఇక ఇన్ని రోజులకు ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు టీజర్ ను కూడా రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ టీజర్ ఈవెంట్ ను రామ జన్మభూమి అయోధ్యలో నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. ఇక టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ లో రాముడి లుక్ లో ప్రభాస్ అదరగొట్టాడు. ఇక ఇదొక విజువల్ వండర్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూమి కుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ కు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు టీజర్ ను చూస్తే నార్త్ లో ప్రభాస్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈనేపథ్యంలోనే హిందీలో ఆదిపురుష్ టీజర్ సరికొత్త రికార్డును సృష్టించింది. బాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆదిపురుష్ టీజర్‌కు హిందీలో ఇప్పటివరకు 9లక్షల 33వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కేవలం 16 గంటల్లోనే ఆదిపురుష్ రికార్డులను క్రియేట్ చేసిందంటే విశేషం అనే చెప్పాలి. మరి ముందు ముందు ఈ టీజర్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కాగా మైథలాజికల్ సినిమాగా ఈసినిమాను తెరకెక్కించాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: