సుధీర్ బాబు హంట్ టీజర్ రిలీజ్

sudheer babus hunt movie teaser out now, hunt movie teaser out now, sudheer babus hunt movie teaser, hunt movie teaser, hunt teaser, hunt Telugu movie teaser, sudheer babu Latest Movie, sudheer babu's Upcoming Movie, Hunt, Hunt Telugu movie, Hunt New Update, Hunt Telugu Movie New Update, Hunt Movie, Hunt Latest Update, Hunt Movie Updates, Hunt Telugu Movie Live Updates, Hunt Telugu Movie Latest News, Hunt Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు. రీసెంట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు కు ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హంట్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే పలు పోస్టర్లను పంచుకుంటూ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ ను సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే అదే రోజు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. ఇక నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ను బట్టి ఈసినిమాలో సుధీర్ బాబు రెండు పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు పాత్రలని అర్జున్‌ A, అర్జున్‌ Bగా పరిచయం చేశారు. ‘అర్జున్‌ Aకి తెలిసిన మనుషులు, ఇన్సిడెన్సెస్‌, పర్సనల్‌ లైఫ్‌ ఇవేవి అర్జన్‌ Bకి తెలియవు. కానీ, అర్జున్‌ Aకి తెలిసిన లాంగ్వేజెస్‌, స్కిల్స్‌,పోలీస్ ట్రైనింగ్‌ ఇవన్ని అర్జున్‌ Bకు కూడా ఉన్నాయి’ అనే డైలాగ్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్‌చేస్తున్నాయి. ‘ఏ కేసునైతే ఆ అర్జున్‌ సాల్వ్‌ చేయలేకపోయాడో.. అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్‌ సాల్వ్‌ చేయాలి’ అంటూ శ్రీకాంత్‌ పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈసినిమాలో అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు, మోహన్ భార్గవ్ పాత్రలో శ్రీకాంత్, దేవ్‌గా భరత్ నటిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి చూస్తుంటే ఈసారి సుధీర్ బాబు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + sixteen =