చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ తరలి వచ్చిన తరువాత హైదరాబాద్ లో పలు స్టూడియోలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ కి చెందిన అన్నపూర్ణ స్టూడియో, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రామానాయుడు స్టూడియో, రామానాయుడు సినీ విలేజ్ (నానక్ రామ్ గూడా) సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి చెందిన పద్మాలయా స్టూడియో, ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణా హార్టికల్చరల్ స్టూడియో (నాచారం) లు ఉన్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో , రామానాయుడు స్టూడియో రన్ అవుతూ సినిమా షూటింగ్ లతో కళ కళలాడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా అల్లు వారి ఫ్యామిలీ నుంచి అల్లు స్టూడియోస్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని అల్లు అరవింద్ కు చెందిన సువిశాలమైన స్థలంలో అల్లు స్టూడియోస్ నిర్మించబడింది. ఆధునిక వసతులతో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు, రియాలిటీ షోలకు అనువుగా వుండే విధంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కూడా అధునాతన సాంకేతికతని ఈ స్టూడియో ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ అల్లు అర్జున్ పుష్ప:ది రూల్ మూవీ షూటింగ్ తో అల్లు స్టూడియోస్ ప్రారంభం కానుందని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: