సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా నానే వరువేన్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ ను బట్టి సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుందని అర్థమవుతుంది. ఇక టీజర్ లో ధనుష్ డ్యూయల్ రోల్ లో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. క్లాస్ రోల్ లోను, అలానే రస్టిక్ లుక్ లోను ధనుష్ ను ఈ టీజర్ లో చూడొచ్చు. ఈటీజర్ లో ముఖ్యంగా థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి టీజర్ లో అదిరిపోయాయి.
Here’s an intriguing teaser of @dhanushkraja & @selvaraghavan‘s #NeneVasthunna ~ #NaaneVaruvean 🔥
Telugu Teaser▶️https://t.co/JgciYbmhUb
In cinemas, Sep 2022!#AlluAravind #KalaippuliSThanu @thisisysr @ElliAvrRam @theedittable @omdop @Rvijaimurugan @theVcreations @GeethaArts pic.twitter.com/owaYb1tHCH
— Geetha Arts (@GeethaArts) September 15, 2022
కాగా ఈసినిమాలో దనుష్ సరసన ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం హీరోయిన్లుగా నటిస్తుండగా.. సెల్వ రాఘవన్, ప్రభు, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: