తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో ఇక్కడ కూడా ఎంతోమంది తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. దానికి కారణం ఆయన చేసే సినిమాలు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు కార్తి. అందుకే వరుస హిట్లను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన విరుమన్ సినిమా సూపర్ హిట్ అయి తమిళనాట మంచి వసూళ్లను కూడా అందించింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సర్దార్ సినిమా కూడా ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు అభిమన్యుడు మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను అలానే టీజర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. రజీషా విజయన్, లైలా, యోగి సేతు, మునీష్కాంత్, మాస్టర్ రిత్విక్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఈసినిమాను దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అన్నపూర్ణ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: