నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూనే మరోపక్క ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక చిన్నప్పటి నుండి తన క్రష్ అయిన తమిళ్ స్టార్ హీరో విజయ్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ తో పాటు పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ క్యూట్ సెల్ఫీ వైరల్ గా మారిపోయింది. ఈ సెల్ఫీ ఎవరిదో కాదు రష్మిక ఇంకా విజయ్ ది. ఈ సినిమా సెట్స్ లో విజయ్ తో కలిసి రష్మికా ఓ సెల్ఫీ దిగింది. అందులో విజయ్ స్టైలిష్ హెయిర్ స్టయిల్ లో కనిపిస్తుండగా.. మరోవైపు రష్మిక మాత్రం ఫుల్ స్మైల్ తో ఉంది. ఇక ఈ సెల్ఫీ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా.. ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ గా మారింది.
ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: