తమిళ్, తెలుగు రెండు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు తమిళ్ స్టార్ హీరో ధనుష్. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరొక సినిమా. ఈరెండింటిలో ఇప్పటికే వెంకీ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంటుంది. సార్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమిళ్ లో కూడా మరొక సినమా చేస్తున్నాడు ధనుష్. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా నానే వరువేన్. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో పలు సినిమాలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెలలోనే ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. నేనే వస్తున్నా అనే టైటిల్ తో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు.
Happy to acquire the Telugu theatrical release rights of @dhanushkraja & @selvaraghavan‘s #NaaneVaruvean ~ #NeneVasthunna ✨
In cinemas worldwide this September 2022!#AlluAravind #KalaippuliSThanu @thisisysr @theedittable @omdop @Rvijaimurugan @theVcreations @saregamasouth pic.twitter.com/Fk9cUIVAwu
— Geetha Arts (@GeethaArts) September 14, 2022
కాగా ఈసినిమాలో ధనుష్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. దనుష్ సరసన ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం హీరోయిన్లుగా నటిస్తుండగా.. సెల్వ రాఘవన్, ప్రభు, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: