తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ -విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు మోషన్ పోస్టర్ రిలీజ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Tomorrow a Surprise for you🥰#Suriya42MotionPoster Video will be out tomorrow at 10 am. Excited 🔥#Suriya42 @Suriya_offl @Suriya_offl @directorsiva @StudioGreen2 @UV_Creations @vcelluloidsoffl #Vamsi #Pramod #Vikram @kegvraja @ThisIsDSP @vetrivisuals #Milan @SupremeSundar_ pic.twitter.com/CCHNXHZB78
— UV Creations (@UV_Creations) September 8, 2022
కాాగా ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఏకకాలంలో రూపొందించనున్నట్టు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా ఈసినిమాతో సూర్య మరో సినిమా కూడా చేస్తున్నారు. విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అచలుడు అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్యోతిక నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: