2022 సంవత్సరం లో ఇప్పటి వరకూ రిలీజయిన తెలుగు మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి 100 కోట్ల క్లబ్ లో చేరిన మూవీస్ గురించి తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఆర్ ఆర్ : డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ సర్కారు వారి పాట మూవీ మే 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. విశేష ప్రేక్షకాదరణ తో ఈ మూవీ 230 కోట్లు కలెక్ట్ చేసింది.
భీమ్లా నాయక్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈమూవీ 165 కోట్లు కలెక్ట్ చేసింది.
రాధేశ్యామ్ : గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.రాధేశ్యామ్ మూవీ మిక్స్డ్ టాక్ తో 154 కోట్లు రాబట్టడం విశేషం.
F 3 : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ F 2:ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన F 3 మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 126 కోట్లు కలెక్ట్ చేసింది.
కార్తికేయ 2 : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో 30 కోట్ల మార్క్ కు చేరుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)