సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శాకినీ ఢాకిని మూవీ రిలీజ్ కి టైమ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీ గా చేపట్టిన విషయం తెలిసిందే. హీరోయిన్స్ రెజీనా , నివేదా ఇద్దరూ కూడా పలు ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నివేదా థామస్ శాకినీ ఢాకిని మూవీలో తన పాత్రపై స్పందించారు. నివేదా థామస్ మాట్లాడుతూ .. ఈ మూవీ లో క్యారెక్టర్ కై ఎంపిక అయిన తరువాత మిడ్ నైట్ రన్నర్స్ మూవీ చూశాననీ , ఆ సినిమాలో పాత్రను, తన నిజ జీవితం ఆధారంగా రాసినట్టు అనిపించిందనీ , తనకు తెలియకుండా తన పాత్రతో స్క్రీన్ ప్లే చేసి సినిమా తీశారా అనిపించిందనీ ,ఈ పాత్ర కు తాను ఎంపిక కావడం ఆశ్చర్యం కలిగించిందనీ , ఈ పాత్ర తనను చేయమని అడిగిన తర్వాత, పెద్దగా కష్టపడక్కర్లేదని అనిపించిందనీ , కొంచెం తెలంగాణ యాస నేర్చుకొని తనలాగా ఉంటే సరిపోతుందనిపించిందనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: