గాడ్ ఫాదర్ నుండి నయనతార లుక్ రిలీజ్

Nayanthara Look from GodFather Revealed, GodFather Nayanthara Look, Nayanthara’s look from Godfather revealed, Chiranjeevi’s Godfather, Nayanthara first look as Sathyapriya Jaidev, Jayam Mohan Raja's Godfather, Nayanthara's first Look, Sathyapriya Jaidev, Godfather, Godfather Movie Update, Godfather Telugu Movie New Update, Nayanthara's first look from upcoming film Godfather, Nayanthara Upcoming film, Godfather Movie Latest News And Updates, Mega Star Chiranjeevi, Mega Star's Godfather, Nayanthara, Nayanthara Latest Telugu Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమా రీమేక్ తో వస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆచార్య సినిమా కాస్త నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ఈసినిమాపైనే ఆశలు పెంచుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ పై కూడా రెండు రోజుల నుండి రూమర్లు మొదలయ్యాయి. అయితే ఆ రూమర్లపై స్పందించిన మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని, అనుకున్న టైమ్ కే అక్టోబర్ 5నే ప్రపంచవ్యాప్తంగా ‘గాడ్ ఫాదర్’ సినిమాను రిలీజ్ చేస్తామని, అతి త్వరలో ప్రమోషనల్ ఈవెంట్స్ స్టార్ట్ చేస్తామని ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ క్లారిటీనిచ్చారు. ఇక చెప్పినట్టే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. నేడు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నయనతార లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సత్య ప్రియ జయదేవ్ అనే పాత్రలో నయనతార నటిస్తుంది.

కాగా మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =