కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మెగా స్టార్ చిరంజీవి , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లపై స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన సాంగ్ ఈ మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ బర్త్ డే కానుకగా మేకర్స్ రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. గాడ్ ఫాదర్ మూవీ వాయిదా పడిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నూటికి నూరు శాతం పక్కాగా ముందుగా తాము ప్రకటించిన విధంగా గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న విడుదల అవడం ఖాయం అని నిర్మాత ఎన్ వి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: