పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ సూపర్ హిట్ “భీమ్లానాయక్ ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.హీరో కళ్యాణ్ రామ్ , సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన “బింబిసార “ మూవీ నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సంయుక్త ప్రస్తుతం ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న“సార్” , ఒక మలయాళ , ఒక కన్నడ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో “భీమ్లానాయక్ ”, “బింబిసార” మూవీస్ తో సక్సెస్ సాధించిన సంయుక్త ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..”బింబిసార”లో హీరో కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి నటించారనీ , ఎన్టీఆర్ నటనా ప్రావీణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే ననీ , ఇక పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం, ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ అనీ , సూపర్ స్టార్ మహేష్ బాబు ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ లాంటి వారనీ , ఆయన పక్కన సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: