వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కు థాంక్యూ సినిమాతో బ్రేక్ పడింది. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు చైతు. అయితే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన థాంక్యూ సినిమా మాత్రం నిరాశను మిగిల్చింది. ఇక చైతు మాత్రం అవేమి పట్టంచుకోకుండా ప్రస్తుతం తన తరువాత సినిమాలపై ఫోకస్ ను పెట్టేశాడు. ఇప్పటికే తను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా రిలీజ్ కు సద్దింగా ఉంది. అంతేకాదు చైతు డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. మరో యంగ్ డైరెక్టర్ కు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ఎవరో కాదు డీజే టిల్లు సినిమాతో మంచి హిట్ కొట్టిన విమల్ కృష్ణ. తాజా సమాచారం ప్రకారం విమల్ కృష్ణ నాగ చైతన్యకు ఓ కథ వినిపించాడని.. నాగ చైతన్యకు కూడా కథ నచ్చిందని అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
విమల్ కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈసినిమా సీక్వెల్ కు కూడా రెడీ అవుతున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: