యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగ చైతన్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“థాంక్యూ ” మూవీ రిలీజ్ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పలు విషయాలను మీడియా తో ముచ్చటించారు. రైటర్ బీవీఎస్ రవి అందించిన కథ తో “థ్యాంక్యూ”లో హీరో పాత్రలో కాలేజ్, టీనేజ్.. ఇలా అన్నింటినీ డిజైన్ చేశామనీ , స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీదర్శకుడు విక్రమ్ స్టైల్‌లో రాయమని రవికి చెప్పాననీ , కరోనా లాక్‌డౌన్ సమయంలో తాను కూడా వ్యక్తిగతంగా ‘థ్యాంక్యూ’ జర్నీని స్టార్ట్ చేశాననీ , తనకు స్కూల్లో, ఆటోమొబైల్ రంగంలో సహాయం చేసిన వారందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాననీ , ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్యాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాననీ , కథ విషయంలో ప్రతి డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తాననీ , తన సలహాలను కొందరు డైరెక్టర్లు వింటారు.. మరికొందరు తామే రైట్ అంటారు. అలాంటివాళ్లతో నేను వాదించననీ , పెద్ద డైరెక్టర్ల అనుభవాలు వాడుకుంటాననీ , కొత్తవాళ్లకి పాయింట్ టు పాయింట్ రాసిస్తాననీ , దానికి రీచ్ అవుతున్నామా? లేదా అని చెక్ చేస్తాననీ , కరోనా తర్వాత ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయనీ , లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చాలా కంటెంట్ చూసి, ఎడ్యుకేట్ అయ్యారనీ , .ఇప్పుడు వాళ్లకి అంతంత మాత్రం కంటెంట్ నచ్చట్లేదనీ ,ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మారాల్సిన టైమ్ వచ్చిందనీ , మంచి కంటెంట్ ఇచ్చి టిక్కెట్ ధరలు తగ్గిస్తే జనాలు వస్తారనీ , ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు వచ్చే జనాలు తగ్గారనీ , మీడియం రేంజ్ నుంచి టాప్ స్టార్స్ సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలనీ , .అది ఎన్ని వారాలకు? అనేది నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నామనీ , ఈ మధ్య వచ్చిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు ఆదరించారు… మంచి కంటెంట్ ఉంటే హిట్ చేస్తారనీ , ఒక సినిమా ఫ్లాప్‌కు చాలా కారణాలుంటాయి. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందులవల్ల జనాల్లో డబ్బు ఖర్చు చేసే సత్తా కూడా తగ్గింది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది గతంలో నిర్మాత సమస్య. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నామనీ ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్‌హిట్ అయినా వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ వసూళ్లు, ఆ ఎనర్జీ వేరనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: