వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ప్రివ్యూ షో మెగా స్టార్ చిరంజీవి ఇంటిలో ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. ఈ ప్రివ్యూ షోను అమీర్‌ఖాన్‌తో కలిసి చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్, నాగ చైతన్య వీక్షించారు. చాలా రోజుల క్రితం జపాన్‌లోని టోక్యో ఏయిర్‌పోర్ట్‌లో అమీర్‌ఖాన్‌ను కలిశాననీ , మా ఇద్దరి మధ్య చిట్ చాట్ జరిగిందనీ , ఈ చిట్ చాట్ అమీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన “లాల్ సింగ్ చద్దా “మూవీ లో తనను కూడా భాగమయ్యేలా చేసిందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో ప్రివ్యూ వేసినందుకు అమీర్‌ఖాన్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: