మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కు ఫ్యాన్స్ ఉండరు భక్తులు ఉంటారు అన్నంత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. దానికి కారణం ఆయన చేసిన సినిమాలు, ఆయన నటన, స్టైల్, స్వాగ్ ఇలా అన్ని అప్పట్లో యూత్ ను మెస్మరైజ్ చేశాయి. ముఖ్యంగా తన కెరీర్ లో వచ్చిన తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు అయితే పవన్ కు ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. పవన్ సినీ కెరీర్ లో ఈసినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన సినిమాల్లోని పాటల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఆల్బమ్ కూడా సూపర్ హిట్టే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. పవన్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ సినిమా అయిన తమ్ముడు సినిమా వచ్చి 23 ఏళ్ళు అయింది. ఈ సందర్బంగా ఇన్నాళ్లు పెద్దగా కనిపించని.. ఈసినిమాకు పనిచేసిన రమణ గోగుల తన సోషల్ మీడియా ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను పవన్ కోసం ఈ సాంగ్ కంపోజ్ చేసి 23 ఏళ్ళు అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని.. ఈసినిమాలోని సాంగ్ ని తాను మళ్ళీ ఇప్పుడు పాడి ఆ పాటను షేర్ చేశారు. దీనితో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక దీనికి గాను హరీష్ శంకర్ స్పందిస్తూ.. సూపర్ సార్.. మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు థ్యాంక్స్.. త్వరలో కలుద్దాం అంటూ రిప్లై ఇచ్చాడు. మరి పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్ లో మళ్లీ రమణ గోగులతో పాట పాడించే అవకాశం ఉందేమో చూద్దాం..
Awesome sir …. Thanks alot for bringing back memories
I will meet soon sir @RamanaGogula https://t.co/5t55ecCIcb— Harish Shankar .S (@harish2you) July 15, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: