టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో ఇప్పటివరకూ ఫ్లాప్ అందుకోని డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో అనిల్ రావిపూడి పేరు కూడా ఉంటుంది. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ ఆరు సినిమాలు చేశాడు. ఆరు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇటీవలే ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 తీసి మంచి హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టింది. ఎప్పుడో ఈసీక్వెల్ సెట్స్ పైకి వెళ్లినా ఆతరువాత కరోనా వల్ల కొద్ది రోజులు లేట్ అవ్వడం.. తరువాత యూనిట్ సభ్యులే కరోనాకు గురవ్వడం.. ఇలా పలుమార్లు బ్రేకులు పడ్డాయి. ఇక రిలీజ్ సమయంలో కూడా చాలా సార్లు వాయిదా పడింది. కరోనా వల్ల థియేటర్లు తెరిచినా ఆడియన్స్ వస్తారా?లేదా ? అన్నది మరో సమస్య. ఇలాంటి నేపథ్యంలో థియేటర్లలోనే రిలీజ్ చేశారు. అది కూడా తక్కువ టికెట్ ధరలకే అయినా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ అందించింది. ఇవన్నీ ఒకఎత్తైతే ఈసినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 థియేటర్లలో ఈసినిమా నడుస్తుందంటే గొప్ప విషయమనే చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో ఈసినిమాను ఇంత సక్సెస్ చేసినందుకు గాను అనిల్ రావిపూడి ఆడియన్స్ కు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా నోట్ పోస్ట్ చేశారు. కరోనా సమయంలో ఎన్నో కష్టాల మధ్య మేము ఎఫ్ 3 మూవీ తెరకెక్కించాము. ఇక పాండమిక్ తరువాత కూడా రిలీజ్ అయిన సినిమాల్లో మా సినిమాని కూడా ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా ఇటువంటి సమయంలో ఎఫ్ 3 మూవీ మీ అందరి ఆదరణతో 50 రోజులు నడవడం మాములు విషయం కాదు, అందుకే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మా మూవీ టీమ్ అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ నోట్ లో పేర్కొన్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: