మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఈసినిమా కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు ముందునుండీ అనుకుంటున్నట్లుగానే రంగమార్తాండ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాలో అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా అనసూయ కూడా తన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేసేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: