బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ ” మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ “భీమ్లానాయక్ “మూవీ లో తన అద్భుతమైన డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నారు. సముద్రఖని డైరెక్షన్‌లో చేయబోతున్న” వినోధయ సీతమ్”తమిళ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పవన్ దీక్షకు పూనారు. నాలుగు మాసాలపాటు పవన్ కల్యాణ్ దీక్ష కొనసాగుతుంది.ఈ చాతుర్మాస్య దీక్ష హైందవ సంప్రదాయంలో ఉంది. నాలుగు నెలల పాటు చేపట్టాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్షలు చేయాలి. చాలా కఠిన నియమాలు ఉంటాయ్.ఆదివారం తొలి ఏకాదశి, శుభప్రదమైన పుణ్య దినం కావడంతో పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ప్రారంభించారు. ఆషాఢం,శ్రావణం, భాద్రపదం,ఆశ్వీయుజ మాసాల్లో ఈ దీక్ష కొనసాగనుంది.అరుణోదయవేళ స్నానం చేయాలి. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. ఈ చాతుర్మాస కాలంలో ఈ నియమాల్ని పవన్ కళ్యాణ్ కూడా పాటించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: