వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#NTR30 “మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనార్థన్ అనే ఎన్టీఆర్ అభిమాని అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనార్థన్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. దీంతో అభిమాన హీరో ఎన్టీఆర్ తో జనార్ధన్ మాట్లాడాలనుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ జనార్దన్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ ఫోన్ లో మాట్లాడుతూ .. నువ్వు త్వరగా కోలుకుని వస్తే, మనం త్వరలోనే కలుద్దామనీ , దేవుడిపై నమ్మకం, భారం పెట్టు అనీ , నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాననీ , త్వరగా కోలుకుని వచ్చేయి, నిన్ను చూడాలని తనకు కూడా ఉందనీ చెప్పారు. వాళ్ల అమ్మగారితోనూ ఎన్టీఆర్ ఫోన్ మాట్లాడుతూ ఆమెకి భరోసా ఇస్తూ , తన సహకారం ఎప్పుడూ ఉంటుందనీ తన మంచి మనసును చాటుకున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: