దసరా పండగ కి “గాడ్ ఫాదర్” , “NBK107 ” మధ్య పోటీ ?

Godfather and NBK107 to lock horns for Dasara,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movie Udpates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi New Movie Updates,Chiranjeevi God Father Movie Updates, God Father,Godfather Movie Udpates,Godfather Movie Latest Udpates,Chiranjeevi Godfather Movie latest Updates,Chiranjeevi and Balakrishna Movies Releasing on Dussehra Festival, God Father and #NBK107 Movie Releasing on Dussehra,Balakrishna #NBK107 Movie Udpates,#NBK107 Latest Movie Updates,Balakrishna #NBK107 Movie Updates,Balakrishna Movies,Balakrishna New Movie, Balakrishna Upcoming Movies,Chiranjeevi and Balakrishna Movies on Dussehra

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర లో నటించే అవకాశం ఉందని సమాచారం.

“గాడ్ ఫాదర్” , “NBK107 ” మూవీస్ రెండూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ… ఇద్దరూ ఇద్దరే. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ అశేష అభిమాన గణం ఉంది. ఎవరి సినిమా విడుదలైనా…. మన థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా “ఖైదీ నంబర్ 150”, బాలకృష్ణ వందో సినిమా “గౌతమి పుత్ర శాతకర్ణి” ఒక్క రోజు వ్యవధిలో విడుదల అయ్యి ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ దసరాకు కూడా అటువంటి పోటీ ఉండవచ్చని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.