“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ తమన్నా బాలీవుడ్లో బిజీగా మారుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ తమన్నా నార్త్ ఫ్యాన్స్ , సౌత్ ఫ్యాన్స్ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సౌత్ ఇండియాలో అభిమానులు, ఆర్టిస్ట్ ల మనోభావాలను అర్థం చేసుకుంటారనీ , ఆర్టిస్టులను అమితంగా అభిమానిస్తారనీ , ఉత్తరాది అభిమానులు మాత్రం అంత డెప్త్ గా అభిమానం చూపించలేరనీ , స్టార్స్, ఫ్యాన్స్ మధ్య హెల్తీ రిలేషన్ షిప్ సౌత్ ఇండియాలోనే ఉంటుందనీ , ఇక స్టార్స్ ని ట్రోల్ చేయడంలో నార్త్ అభిమానులు ముందు ఉంటారనీ , నార్త్ ఫ్యాన్స్ కంటే సౌత్ ఫ్యాన్స్ గొప్ప అనీ చెప్పారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























