మెగా స్టార్ చిరంజీవి హీరోగా “భోళా శంకర్ “, “గాడ్ ఫాదర్ “, “చిరంజీవి 154 “మూవీస్ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహా శివరాత్రి సందర్భంగా “భోళా శంకర్”చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. చిరంజీవి స్టైలిష్ లుక్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “భోళా శంకర్”మూవీ కొత్త షెడ్యూల్ డేట్ ను చిత్ర యూనిట్ గురువారం అధికారికంగా ప్రకటించింది. “భోళా శంకర్”మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 21 వ తేదీ ప్రారంభం కానుంది. హీరో చిరంజీవి ఏక కాలం లో మూడు సినిమాలలో నటించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: