రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సినిమా మేజర్. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచిన ఉన్ని కృష్ణన్ బయోపిక్ ను తీసినందుకు చాలా మంది చిత్రయూనిట్ ను అభినందిస్తున్నారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాస్ బస్టర్ హిట్ కొట్టి దూసుకుపోతుంది. అంతేకాదు ఈసినిమా కలెక్షన్స్ ను కూడా అడివి శేష్ ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతుండగా.. వారం రోజుల్లో ఈసినిమా 50కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అడివి శేష్ మరోసారి తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్పూర్తితో ఈసినిమా తీశాం.. ఈసినిమా ఎంతో మంది హృదయాలను తాకింది. ఈసినిమా నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని.. థాంక్యూ మహేష్ సర్.. ఈసినిమా గోల్డెన్ ఫిష్ లా అంత బ్రైట్ అవ్వడానికి మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు.. అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
View this post on Instagram
ఇక ఓవర్సీస్ లో కూడా ఈసినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈసినిమా 1 మిలియన్ క్లబ్ లోకి కూడా చేరిపోయి మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ముందు ముందు ఓవర్సీస్ లో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: