టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా జులై1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. అంతేకాదు ఇప్పటికే పాటలు, టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు కూడా. మరోవైపు ట్రైలర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. జూన్12 ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉండగా.. తాజాగా ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Macho star @YoursGopichand & Blockbuster @DirectorMaruthi ‘s #PakkaCommercial Shoot Wrapped up!✨#PakkaCommercialTrailer Releasing on June 12th! 🔥#AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official #PakkaCommercialOnJuly1st 🤩 pic.twitter.com/0lcQ6jGSTJ
— UV Creations (@UV_Creations) June 10, 2022
ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశీ ఖన్నా నటిస్తుంది. ఈసినిమాలో వీరిద్దరూ లాయర్ పాత్రల్లో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైపోయింది. ఇంకా ఈసినిమాలో సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: