లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 5 దశాబ్దాల సినీ కెరీర్ లో పలు భాషల సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బాలు పుట్టిన రోజు (జూన్ 4)న సినీ మ్యూజిషియన్స్ యూనియన్ రవీంద్ర భారతిలో ‘బాలుకి ప్రేమతో’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల ప్రోగ్రామ్ ను నిర్వహించనుంది. సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ బాలు గారంటే మా అందరికీ ప్రాణమనీ , మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి.అనీ , ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12గంటలపాటు సంగీత విభావరి చేస్తూ బాలు బర్త్‌డేని కన్నుల పండుగగా సెలబ్రేట్ చేస్తున్నామనీ , ఆయన పుట్టిన రోజు తో ఆ మహనీయుడిని గుర్తు చేసుకోవటం మేమందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నామనీ చెప్పారు. ’
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మీ మాట్లాడుతూ 30 ఏళ్ల చరిత్ర ఉన్న సినిమా మ్యూజిక్ యూనియన్‌లో 1500మందికి పైగా సభ్యులున్నారనీ , బాలుగారు మా కుల దైవమనీ , మా అందరికీ మార్గదర్శకులుగా నిలిచారనీ , దురదృష్టవశాత్తు ఆయన్ను కోల్పోయామనీ , ఆ సమయంలో ఆయనకు సరైన నివాళి ఇవ్వలేదన్న వెలితి మాలో ఉందనీ , అందుకే జూన్ 4 ఆయన జయంతిని పురస్కరించుకుని మా యూనియన్ అంతా కలిసికట్టుగా ‘బాలుకి ప్రేమతో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: