‘విక్రమ్’లో గొప్ప మ్యాజిక్ వుంది

Kamal Haasan Interview about Vikram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Movie Updates,Kamal Haasan Vikram Movie Updates,Kamal Haasan About Vikram Movie,Kamal Haasan Vikram Movie latest Updates, Vikram Movie latest Updates,Kamal Haasan Interview for Vikram Movie,Vikram Movie Review,Vikram Telugu Movie Review,Vikram Review And Rating,Vikram Premiere Show Review,Vikram Pre Review,Vikram Movie Pre Review,Vikram (film),Vikram Movie (2022), Vikram Movie Plus Points,Vikram FDFS Review,Vikram Movie First Review,Vikram First Review Out,Vikram Movie Public Talk,Vikram Movie Public Response, Vikram Movie Highlights,Vikram Movie Story,Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram (2022),Vikram Movie Review (2022),Vikram Movie Updates, Vikram Movie Latest News and Updates,Vikram Movie Latest News,Vikram Telugu Movie Latest News,Vikram Telugu Movie Live Updates,Vikram Highlights, Vikram Public Response,Kamal Haasan,Vijay Sethupathi,Fahadh Faasil,Lokesh Kanagaraj,Anirudh Ravichander

కమల్ హాసన్ కథానాయకుడి గా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ లో చేస్తున్నారు. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్ 3న ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది. ఈ సందర్భంగా మీడియాతో ‘విక్రమ్’ చిత్రం విశేషాలు పంచుకున్నారు కమల్ హాసన్. ఆయన చెప్పిన విక్రమ్ విశేషాలివి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని తాజాగా కలిశారు కదా.. మీ మధ్య ఎలాంటి అంశాలు చర్చలోకి వస్తుంటాయి?
మేము తరచుగా కలుస్తూనే వుంటాం. గత నలభై ఏళ్లుగా ఇది జరుగుతూనే వుంది. మా సినిమాలు గురించి, స్నేహితుల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. ‘విక్రమ్ సినిమాకి చాలా మంచి వైబ్రేషన్స్ వున్నాయి, కంగ్రాట్యులేషన్స్ ” అని రజనీ చెప్పారు.

రాజకీయాలు గురించి కూడా మాట్లాడుతుంటారా ?
చాలా తక్కువ. మా ఇద్దరిదీ భిన్నమైన ఫిలాసఫీ. మేము ఎప్పుడూ పొలిటికల్ డిబేట్స్ జోలికి వెళ్ళం. మా స్నేహానికి గౌరవిస్తాం.

‘విక్రమ్’ ట్రైలర్ లో అడవిలో వేట అన్నట్టుగా చూపించారు.. వేటకి సంబధించిన ఫిలాసఫీ కూడా చెప్పారా ?
ఇది కాంక్రీట్ అడవి అనుకుంటే ఇది కూడా అడవే. క్రైమ్ విషయానికి వస్తే డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా భాగస్వాములుగా వున్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు. విక్రమ్ కథలో ఇలాంటి అంశాలాన్నీ చూడబోతున్నాం. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి. విక్రమ్ డార్క్ మూవీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. విక్రమ్ గ్రేట్ థియేటర్ ఎక్స్ పిరియన్స్ వున్న సినిమా. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

ఇంతకీ ఇందులో విక్రమ్ ఎవరు ?
ఇది ముందే చెప్పేస్తే ఇంక మ్యాజిక్ పోతుంది. మెజీషియన్ తన హార్ట్ నుండి రాబిట్ తీస్తాడు. ఇది అసంభవమని మనకి తెలుసు. కానీ అది ఎలా తీశాడో మెజీషియన్ చెప్పడు. అదే మ్యాజిక్ (నవ్వుతూ). విక్రమ్ ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (నవ్వుతూ)

హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేస్తున్నారు కదా ?
హీరో నితిన్, వారి నాన్న గారు సుధాకర్ రెడ్డి గారికి సినిమాపై ప్యాషన్ వుంది. వారి నిర్మాణంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. వారికి సినిమాల పట్ల మంచి అభిరుచి వుంది. ‘విక్రమ్’ ని దాదాపు 400పైగా థియేటర్స్ లో భారీ విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి స్పెషల్ థ్యాంక్స్.

ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఏదైనా ఒక ఛాలెంజ్ ఉండేలా చూసుకుంటారు కదా.. విక్రమ్ లో మీకు ఛాలెంజ్ అనిపించిన అంశం ఏమిటి ?
ఈ రోజుల్లో సినిమా బాగా ఆడటం, సినిమా బావుండటం రెండూ ఛాలెంజులే. మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్ కి వుంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. అంత ధైర్యం వున్న బాలచందర్, విన్సెంట్ మాస్టర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ.

విక్రమ్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లాంటి స్టార్లు కూడా వున్నారు కదా.. వాళ్ళ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ?
నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది. నా సినిమాల విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్ ని. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. కానీ లోపల నేనెప్పుడూ ఒక కళాకారుడినే. కళాకారుడికి నాటకం ముఖ్యం. నేను స్వయంగా రాసిన చిత్రాలలో కూడా పవర్ ఫుల్ పాత్రలు రాశాను. నా చిత్రాలతో చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు. హీరోలయ్యారు. పోతురాజు సినిమాలో పశుపతి, అన్బే శివంలో మాధవన్ పాత్రలు ఎంతో బలమైనవి.

సూర్య పాత్ర ఎలా ఉండబోతుంది ?
సూర్య స్పెషల్ రోల్ లో కనిపిస్తారు. నిజానికి హీరో ని బుక్ చేసేటప్పుడు నేరుగా కలసి బోకే ఇచ్చి బుక్ చేస్తారు. నేను కూడా సూర్యకి ఒక బోకే ఇద్దామని అనుకున్నా. విక్రమ్ స్పెషల్ రోల్ గురించి కలసి మాట్లాడదామని ఫోన్ చేశా. కానీ ఫోన్ కాల్ లోనే అంతా అయిపొయింది. ”నేను చేస్తా అన్నయ్యా” అన్నారు. నేను వెళ్ళేటప్పటికి మొత్తం అయిపొయింది. బొకే ఇవ్వడం ఇంక కుదరలేదు. షేక్ హ్యాండ్ తో సరిపెట్టుకున్నాం.

సూర్యతో ఫుల్ లెంగ్త్ సినిమా భవిష్యత్ లో వుంటుందా ?
మా బ్యానర్ లో సూర్యతో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాం. చర్చలు నడుస్తున్నాయి. ఈలోగా విక్రమ్ లో స్పెషల్ రోల్ చేశారు. ఐతే సూర్యతో తప్పకుండా సినిమా చేస్తాం. దాదాపు ఐదుగురు దర్శకులతో మాట్లాడాం. మహేష్ నారాయణ్ తో మా బ్యానర్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. మలయాళంలో మాలిక్ లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించారాయన. మహేష్ నారాయణ్ గతంలో విశ్వరూపంకు ఎడిటర్ గా కూడా పని చేశారు. కోవిడ్ సమయంలో సినిమాటోగ్రఫీ కూడా నేర్చ్సుకున్నారు.

తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేయబోతున్నారు ?
నాకూ చేయాలనే వుంది. నేరుగా తెలుగులో సినిమా చేసి చాలా కాలమైపోయింది. దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మీరు చేసే ప్రతి సినిమా ప్రతి భాషలోకి వెళుతుంది. ఇది ఎప్పటి నుండో వుంది. కానీ ఇప్పుడది పాన్ ఇండియా ట్రెండ్ అయ్యింది. దిన్ని ఎలా చూస్తారు ?
ట్రెండ్ అనేది కొత్త న్యూస్ అంతే. చరిత్ర చూస్తే ఇది ఎప్పటి నుండో వుంది. ఏఎన్ఆర్ గారి దేవదాస్ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్ళు ఆడింది. ‘మరో చరిత్ర’కి కూడ ఇదే జరిగింది. ‘సాగర సంగమం’ డబ్ చేశారు. ఇది కూడా అక్కడ సిల్వర్ జూబ్లీ విజయాన్ని అందుకుంది. అలాగే స్వాతిముత్యం. పాన్ ఇండియా అనేది బాలచందర్ లాంటి దర్శకులు ఎప్పుడో ప్రూవ్ చేశారు.

మీరు కూడా తెలుగు, తమిళ అని కాకుండా ఇండియన్ సినిమా అనడానికే ఇష్టపడతారు కదా ?
అవునండీ. ప్రస్తుతం హైదరాబాద్ నేషనల్ ఫిలిం మేకింగ్ హబ్ గా వుంది. ముందు చెన్నై వుండేది. నాగిరెడ్డి గారి లాంటి దర్శకులు మాయాబజార్ లాంటి చిత్రాలని తెలుగు తమిళ్ లో తీసేవారు. రాముడు భీముడు తెలుగు , ఎంగవిట్టి పిళ్ళై తమిళ్, రామ్ ఆర్ శ్యామ్ హిందీ.. ఈ చిత్రాలన్నీ ఒకే నిర్మాణ సంస్థ తీసింది. చంద్రలేఖ మొదటి పాన్ ఇండియా సినిమా. అలాగే ఇప్పుడు బాహుబలి. పాన్ ఇండియా సినిమా అనేది ఎప్పటి నుండో వుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు లాంగ్వేజ్ సినిమాలు తీయలేదు కానీ సౌత్ నుండి అన్ని భాషల చిత్రాలు తెరకెక్కాయి. రామానాయడు గారు అన్ని భాషల చిత్రాలు తీశారు. ఆయన నేషనల్ ప్రోడ్యుసర్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్.

ఓటీటీ లో కూడా ఇంత మార్పు వస్తుందని మీరు ముందే గ్రహించారు కదా ?
ఓటీటీ మార్పు రావాలని నేనేం పట్టుపట్టలేదు. అది కచ్చితంగా రావాలి. ఇప్పుడు వచ్చింది. ఐతే ఎన్ని మార్పులు వచ్చినా దేని ప్రాధన్యత దానికి వుంటుంది. చేతికి పెట్టుకునే వాచ్ వచ్చిందని టవర్ క్లాక్ కి డిమాండ్ తగ్గలేదు కదా. తిరుపతి క్యాలెండర్ ఇంట్లో ఉన్నంత మాత్రాన అక్కడ భక్తుల రద్దీ తగ్గిపోదు కదా. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కూడా అంతే. థియేటర్ అనేది గుడి కంటే గొప్ప చోటని భావిస్తా. ఎందుకంటే పక్కనున్నవాడు ఏ జాతి, మతం అనే పట్టింపు ఎవరికీ వుండదు. ఇది కేవలం స్పోర్ట్స్, సినిమా థియేటర్ లోనే సంభవిస్తుంది,

ఒకప్పుడు మీ సినిమాని నేరుగా టీవీ లో రిలీజ్ చేస్తామంటే గొడవ జరిగింది.. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు కదా ?
కొత్తది ఏది వచ్చినా మొదట భయం వేస్తుంది. పిజ్జా ని చూసి కూడా మొదట ఇలానే ఫీలై ఉంటాము కదా.. అయితే కేవలం పిజ్జానే తినాలంటే ఒప్పుకోము. మనకి ఉలవచారు కూడా ఇష్టం. అన్నీ రుచులు వుంటాయి. అయితే ఫైనల్ గా ఒక ఒరిజినల్ రుచి బయటికి వస్తుంది. ప్రేక్షకుడు అంతిమంగా సినిమాని థియేటర్ లో చూడటానికే ఇష్టపడతాడు. మనందరికీ కిచెన్ వుంటుంది. కానీ ఒకరోజు ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా హోటల్ లో భోజనం చేస్తాం కదా. ఇదీ అంతే.

అనిరుధ్ మ్యూజిక్ గురించి చెప్పండి ?
అనిరుధ్ పెద్ద కళాకారుల కుటుంబం నుండి వచ్చారు. ఆయన గ్రాండ్ ఫాదర్ గ్రేట్ సుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతమైన కళాకారుడు. చాలా గొప్ప సినిమాలకు పని చేశారు. అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇవ్వడంలో నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంత గొప్ప కళాకారుల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా మంచి సంగీతం అందించాలి.

విక్రమ్ లో పాట కూడా పాడారు ?
కే విశ్వనాథ్ గారి నుండి నాకు ఒకటే అలవాటు. సినిమా కోసం ఏదైనా చేయమంటే తప్పకుండా చేస్తాను. విక్రమ్ లో పాట పాడమని అడిగారు. పాడాను.

విశ్వనాథ్ గారిని కలుస్తుంటారా ?
చెన్నైలో ఉండేటప్పుడు వారానికి, నెలకి ఒకసారైన కలిసేవాడిని. ఇప్పుడు ఆయన హైద్రాబాద్ వచ్చారు. ఫోన్ లో తరుచూ మాట్లాడుతూవుంటాం.

నటన, నిర్మాణం, రాజకీయం.. వీటిని ఎలా బ్యాలన్స్ చేస్తున్నారు ?
సౌత్ లో ఇది కొత్త కాదు. సౌత్ లో సినిమా రాజకీయం విడదీయరాని ఒక కలయిక. నా ముందు తరం నటులు, నిర్మాతలు, పెద్దవాళ్ళు అందరూ చేసిందే నేను చేస్తున్నా.

భారతీయుడు 2 దర్శకత్వం మీరే చేస్తున్నారా ?
నా నుండి ప్రేక్షకులు ఏడాదికి రెండు సినిమాలైనా కోరుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే ఇది సాధ్యపడదు. అందుకే దర్శకత్వం వేరే వాళ్లకు అప్పగించి నటనపై దృష్టిపెట్టాలని భావిస్తున్నా.

భారతీయుడు 2ఈ ఏడాది పూర్తవుతుందా ?
పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twenty =