ప్లే బ్యాక్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కేకే గా పాప్యులర్ అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , మరాఠీ , బెంగాలీ , ఒడియా , అస్సామీ , గుజరాతీ భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ తో కేకే ప్రేక్షకులను అలరించారు. “ప్రేమ దేశం” చిత్రంలో ప్లేబ్యాక్ సింగర్‌గా టాలీవుడ్ కు కేకే పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కాలేజీ స్టైలే, హలో డాక్టర్ పాటలు ఆలపించగా.. రెండు సూపర్ హిటయ్యాయి. “ఇంద్ర”, “సంతోషం”, “ఘర్షణ”, “గుడుంబా శంకర్”, “నువ్వేనువ్వే,”, “సైనికుడు” , “నేనున్నాను”లతో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడి కేకే ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన కేకే కోల్‌కతాలోని గురుదాస్ కాలేజీ ఫెస్ట్‌లో లైవ్ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటలు పాడుతున్న తరుణంలో కేకే ఆరోగ్యం క్షీణించింది.లైవ్ ఈవెంట్‌ను ముగించుకొని కేకే తిరిగి బస చేసిన హోటల్‌కు చేరుకున్నారు . అక్కడ కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు. సింగర్ కేకే మృతికి పలువురు సంగీత దర్శకులు సంతాపం తెలిపారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























