విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్.టి.రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు… యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. కేవలం సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలని రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన ఆయన చాలా తక్కువ నెలలోనే ముఖ్యమంత్రిగా పలు సేవలు అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఎన్టీఆర్ శత జయంతి. మరి ఎన్టీఆర్ కు తాత అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తాత పోలికలతో పుట్టినందుకు ఎప్పుడూ తన తాత పేరును తలుచుకుంటూనే ఉంటారు. తన తాతయ్య పట్ల ప్రేమను, గౌరవాన్ని, విధేయతను చూపిస్తూనే ఉంటాడు. ఇక నేడు నందమూరి తారకరామారావు శత జయంతి సందర్బంగా ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఇంకాతన సోషల్ మీడియా ద్వారా కూడా తన తాతను గుర్తుచేసుకున్నాడు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022
ఇక ఎన్టీఆర్ సినిమాసినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో కొరటాల శివతో అలానే ప్రశాంత్ నీల్ తో మరో సినిమా ఉన్నాయి. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయి. త్వరలోనే కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: