పెద్ద పెద్ద సినిమాలకు ఈమధ్య టికెట్ రేట్లు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమాలు అయితే మాములు రేట్లకే టికెట్లను అమ్ముతున్నా.. పెద్ద సినిమాలు కాబట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటంతో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మేజర్ మేకర్స్ కూడా సినిమా టికెట్లపై అప్ డేట్ ఇచ్చారు. ఈసందర్భంగా చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పాండమిక్ తర్వాత అతి తక్కువ రేట్లతో ఈసినిమా వేస్తున్నాము. తెలంగాణలో సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో రూ.295, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 175 ఉండేవి. కానీ మేజర్ చిత్రానికి రూ.100 తగ్గించి మల్టీప్లెక్స్‌లలో రూ.195, సింగిల్ స్క్రీన్‌లలో రూ.150 టిక్కెట్ రేట్లు ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఆంధ్రాలో మల్టీప్లెక్స్‌లో రూ.177, సింగిల్ స్క్రీన్‌లలో రూ.147 గా ఫిక్స్ చేశారు. ‘మేజర్ చిత్రాన్ని అందరు చూడాలనే ఉద్ధేశ్యంతో తక్కువ రేట్లకు సినిమాను ప్రదర్శితం చేయనున్నట్లు’ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A Movie every INDIAN should watch at the most affordable prices.
Lowest prices for any film post pandemic for #MajorTheFilm 🇮🇳 in Telangana and Andhra Pradesh ❤️
– https://t.co/SRKLoa20ah#MajorOnJune3rd #Major pic.twitter.com/z9YSkTxMNT
— GMB Entertainment (@GMBents) May 27, 2022
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. సందీప్ పాత్రలో అడవిశేష్ నటించనున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి.
కాగా శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: