రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టనున్నాడు. ప్రస్తుతం అయితే రెండు సినిమాలను ఫిక్స్ చేశాడు. తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తుండగా.. తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నారు. ఈరెండు సినిమాలను ఎప్పుడో అధికారికంగా ప్రకటించినా ఇంతవరకూ ఏ ఒక్క సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చాయి. ఇక ఈరెండు సినిమాల్లో ముందు కొరటాల శివతో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ప్రశాంత్ నీల్ కు తన సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు. ఇక ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే కే వచ్చింది. అయితే ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉన్నారు. ఇక నేడు ఎన్టీఆర్ బర్త్ డే కి పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మాస్ లుక్ తో ఉన్న ఈపోస్టర్ అప్పుడే అంచనాలు పెంచేసింది. ఇక ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ అందించిన ప్రశాంత్ నీల్ ఫైనల్ గా నా డ్రీమ్ హీరోతో డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నా.. వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ నుండి ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలిపాడు. దీన్నిబట్టి ఈగ్యాప్ లో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను పూర్తి చేసేస్తాడు. మరో వైపు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో చేస్తున్న సలార్ పనులన్నీ కంప్లీట్ చేస్తాడు. ఇక ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: