సినీ పరిశ్రమల్లో ఉన్న హీరో హీరోయిన్లు కాస్త లేటుగానే పెళ్లి చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏదో కొంతమంది మాత్రం తొందరగా పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే వెంటనే వచ్చే పేరు ప్రభాస్ దే. ఇంతకుముందు ప్రభాస్ తో పాటు చాలా మంది పేర్లు వినిపించేవి అయితే గత రెండేళ్లలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ప్రభాస్ కు కూడా ప్రతి ప్రెస్ మీట్ లో ఇలాంటి ప్రశ్న ఎదురవ్వడం కూడా కామన్ అయిపోయింది. మరోవైపు హీరోయిన్లలో అనుష్క పెళ్లి కోసం కూడా ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినా మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ప్రభాస్, అనుష్క పెళ్లి తర్వాతే తన పెళ్లి అంటున్నాడు మరో యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు టాలెంటెడ్ నటుడు అడివి శేష్. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈసందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అడివి శేష్ ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయనను ప్రశ్నించగా.. దానికి ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. తన స్నేహితులు ప్రభాస్, అనుష్క కూడా పెళ్లి చేసుకోలేదని… వాళ్లిద్దరి పెళ్లి అయిపోయిన తర్వాత తాను చేసుకుంటానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి ప్రభాస్, అనుష్కల పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది.
కాగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈసినిమాతో పాటు హిట్ సినిమా సీక్వెల్ హిట్ 2 సినిమాను కూడా చేస్తున్నాడు అడివి శేష్. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: